షర్మిల కొంపముంచిన పబ్లిసిటీ !

Telugu Lo Computer
0


తమిళనాడులో తొలి మహిళా బస్సు డ్రైవర్‌గా సంచలనం సృష్టించి షర్మిల. ఇప్పుడు తను ఉద్యోగం కోల్పోయింది. కష్టపడి, ఏదైనా సాధించాలనే పట్టుదలతో సాహసోపేతమైన రంగాన్ని ఎంచుకుని, ఎన్ని విమర్శలు ఎదురైనా పట్టుదలగా డ్రైవింగ్‌ నేర్చుకుని అత్యంత నైపుణ్యంతో భారీ వాహనం అయిన బస్సుని నడుపుతూ అందరినీ ఆకట్టుకుంది షర్మిల. అంతేకాదు కోయంబత్తూరులో మొదటి మహిళా బస్సు డ్రైవర్‌గా నిలిచింది. అతి తక్కువ కాలంలో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. షర్మిల దైర్యంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిపించారు. రాజకీయ ప్రముఖులు, విఐపీలు సైతం నేరుగా షర్మిలను ప్రశంసించారు. సోషల్‌ మీడియాలో ప్రత్యేక ఇంటర్వ్యూలు కూడా వచ్చాయి. డీఎంకే ఎంపీ కనిమొళి కూడా బస్సు డ్రైవర్‌ షర్మిలను కలిసి ప్రశంసించారు. దీంతో షర్మిల పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. అయితే అకస్మాత్తుగా షర్మిలకు వచ్చిన పాపులారిటీ ఆమెపాలిట శాపమైంది. షర్మిలను ఉద్యోగం నుంచి తొలగించింది యాజమాన్యం. ఇలా ఉద్యోగానికి తీసివేయడానికి కంపెనీ చెప్పిన కారణం వింటే ఎవరైనా షాక్ అవుతారు. షర్మిల కి పబ్లిసిటీ మోజు ఎక్కువైందని, పాపులారిటీ కోసం బస్సు లో ఉన్న ప్రయాణికుల్ని పట్టించుకోవడం లేదని యాజమాన్యం చెబుతోంది. అయితే ఎంపీ కణిమొళిని కలవడం వల్లే షర్మిలను ఉద్యోగంనుంచి తీసేసారని కొందరు, షర్మిల తీరుపై అసహనం కారణంగానే తీసేసిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే షర్మిల వెర్షన్ మాత్రం వేరేగా ఉంది. నన్ను ట్రావెల్‌ యాజమాన్యం అవమానించింది అందుకే ఉద్యోగం మానేశాను అని చెబుతోంది. షర్మిల బస్సు డ్రైవర్ ఉద్యోగం ఎందుకుపోయిందనే వార్త మరోసారి సోషల్ మీడియాలో ట్రేండింగ్ గా మారింది.

Post a Comment

0Comments

Post a Comment (0)