ఢిల్లీ మేయర్‌ పీఠంపై ఆమ్ ఆద్మీ

Telugu Lo Computer
0


ఢిల్లీ మేయర్‌ పీఠాన్ని వరుసగా రెండోసారి ఆమ్ ఆద్మీ పార్టీ దక్కించుకుంది. చివరి నిమిషంలో బీజేపీ అభ్యర్థి శిఖా రాయ్‌ తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో ఆప్‌కు చెందిన షెల్లీ ఒబెరాయ్ మరోసారి ఢిల్లీ మేయర్‌గా బుధవారం ఎన్నికయ్యారు. మేయర్‌గా గెలుపొందేందుకు తగినంత బలం లేకపోవడంతో ఓటమిని ముందే ఊహించిన బీజేపీ పోటీ నుంచి వెనక్కి తగ్గడంతో షెల్లీ ఒబెరాయ్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయంలో కూడా ఇదే జరిగింది. పోటీ నుంచి కాషాయ పార్టీ వైదొలగడంతో ఆప్ అభ్యర్థి ఆలీ మహమ్మద్ ఇక్బాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నిక ప్రక్రియ పూర్తవగానే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సభా కార్యకలాపాలను మే 2కు వాయిదా వేస్తున్నట్లు మేయర్ షెల్లీ ఒబెరాయ్ ప్రకటించారు. కాగా కొత్తగా ఎన్నికైన ఢిల్లీ మేయర్ ఒక సంవత్సరం పదవీకాలంలో ఉండనున్నారు. రొటేషన్ ప్రాతిపదికన అయిదు సంవత్సరాల పాటు ఒక్కో ఏడాది ఒక్కొకరు మేయర్‌గా ఉండనున్నారు. తొలి ఏడాది మహిళలకు, రెండో ఏడాది ఓపెన్ కేటగిరీకి, మూడో సంవత్సరం రిజర్వ్‌డ్ కేటగిరీకి, మిగిలిన రెండు మళ్లీ ఓపెన్ కేటగిరీకి రిజర్వ్ చేస్తారు.


Post a Comment

0Comments

Post a Comment (0)