పెద్ద మనసుతో పెళ్లి చేసుకున్న వరుడు !

Telugu Lo Computer
0


ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన లక్ష్మి అనే యువతికి గత గురువారం శక్తి జిల్లాకు చెందిన రాజ్‌తో వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. అయితే పెళ్లికి వారం రోజుల ముందు లక్ష్మి అనారోగ్యానికి గురైంది. ఆసుపత్రికి తీసుకెళ్లగా, పెద్ద పేగులు పాడైపోయాయని, ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. దీంతో తీవ్ర నిరాశకు గురైన పెళ్లి కుమార్తె  తన పెళ్లిపై పూర్తిగా ఆశలు వదులుకుంది. ఇక ఈ పెళ్లే కాదూ, తనకెప్పటికీ పెళ్లి కాదనే డిసైడ్ అయిపోయింది. ఇక ఈ విషయాన్ని పెళ్లి కుమారుడికి చెప్పారు. అయితే వరుడు రాజ్ మాత్రం వెనకడుగు వేయలేదు. ఇంకా ఆమెకు ధైర్యం చెప్పి తననే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. చెప్పడమే కాదూ హాస్పిటల్ లోనే బెడ్ పైనే వివాహం చేసుకుందామా అంటూ ఆమెకే ప్రతిపాదన పెట్టాడు. దీంతో ఆనందంలో మునిగి తేలిన లక్ష్మీ వెంటనే అంగీకరించింది. లక్ష్మి, ఆమె కుటంబ సభ్యులు ఎంతో సంతోషించి ఆసుపత్రి యాజమాన్యానికి విషయం చెప్పారు. యాజమాన్యం ఎంతో సంతోషించి వారి పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు హాస్పిటల్‌లోనే చేశారు. బెడ్ పైనే ఆమెకు రాజ్ తాళి కట్టాడు. అక్కడే ఆమెతో కలిసి ఏడడుగులు వేశాడు. 

Post a Comment

0Comments

Post a Comment (0)