చిన్నారి కొట్టుకుపోయింది గుంతలో, మ్యాన్‌ హోల్‌ లో కాదు

Telugu Lo Computer
0


చిన్నారి మౌనిక మృతిపై జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి స్పందించారు. సంఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. వరద నీటికి అక్కడ చిన్నపాటి గుంత పడిందని, ఇంతకు ముందుకు అక్కడ అలాంటి గుంత ఏమీ లేదని అన్నారు. ఉదయం కురిసిన భారీ వర్షానికి వరద ఎక్కువ కావడంతో ఆ గుంతలోంచి చిన్నారి కొట్టుకొని పోయిందని అన్నారు. సంఘటనకు కారణమైన అధికారులపై యాక్షన్ తీసుకుంటామని అన్నారు. పదేపదే అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నామని మేయర్‌ అన్నారు. అయినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటన మరొకటి జరగకుండా అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చనిపోయిన చిన్నారి కుటుంబానికి జిహెచ్ఎంసి తరఫున రెండు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)