జగన్ ను నమ్ముకొని అన్నీ కోల్పోయాం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో వైసీపీ 2019 ఎన్నికల్లో 12 స్థానాలు గెలిచింది. ఉరవకొండ, హిందూపురం మాత్రమే టీడీపీ విజయం సాధించింది. తాడిపత్రిలో వైసీపీ నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి విజయం సాధించారు. ఎమ్మెల్యే గా గెలిచిన సమయం నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సస్ పెద్దారెడ్డి అన్నట్లుగా అక్కడ రాజకీయం కొనసాగుతోంది. అనేక సార్లు అక్కడ చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్ర స్థాయిలో చర్చకు దారి తీసాయి. పలు సందర్భాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు తిరిగి వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ నుంచి పెద్దారెడ్డి పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. కానీ, ఈ సమయంలోనే పెద్దారెడ్డి కార్యకర్తల విషయంలో చేసిన వ్యాఖ్యలు జిల్లాలో చర్చకు దారి తీసాయి. యల్లనూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి అక్కడ బైఠాయించారు. దంతలపల్లిలో వైసీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దీని పైన మ్మెల్యే పెద్దారెడ్డి, నారాయణ రెడ్డి వర్గీయుల మధ్య వివాదం నెలకొంది. ఇరు వర్గాలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. దీంతో ఇరు వర్గాలపై యల్లనూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారంటూ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసు స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. ఇదే సమయంలో పార్టీ కోసం పని చేస్తున్న కార్యకర్తలను గుర్తిస్తేనే నేతలుగా గుర్తింపు దక్కుతుందని చెప్పుకొచ్చారు. తాను జగన్ కోసం సర్వం పొగొట్టుకున్నా, కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని పెద్దారెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లో ఉన్న సమయం నుంచి ఇప్పటి వరకు వైఎస్ కోసం పని చేసానని గుర్తు చేసారు. ఎవరు మన కోసం పని చేసారు, వారికి ఏం చేయాలనే ఆలోచన నేతలకు ఉండాలని చెప్పుకొచ్చారు. ఆ ఆలోచన లేకపోతే ఉనికి కోల్పోతారని హెచ్చరించారు. కార్యకర్తలు మద్దతుగా ఉన్నంత వరకే ఎవరైనా నేతలుగా చెలామణి అవుతారని పేర్కొన్నారు. తొలి నుంచి జగన్ కు విధేయుడిగా పేరున్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇప్పుడు చేసిన వ్యాఖ్యల పైన వైసీపీలో చర్చ మొదలైంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)