కర్ణాటక లోని దొడ్డబళ్లాపురం జిల్లా నెలమంగల తాలూకా సోలూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డ్రిల్ మాస్టర్ అయిన అంజన్‌కుమార్‌ను సోలూరు వద్ద చెక్ పోస్టులో తనిఖీ బృందం మేనేజర్‌గా నియమించారు. మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 10 గంటల వరకూ డ్యూటీ. ఈ సమయంలో అటుగా వచ్చిన ప్రముఖ రాజకీయ నేతలతో ఆయన సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై ఫిర్యాదులు రావడంతో బెంగళూరు గ్రామీణ జిల్లా కలెక్టర్ ఆర్.లత అతన్ని సస్పెండ్ చేశారు.
రాజకీయ నేతలతో సెల్ఫీలు దిగిన ఉద్యోగి సస్పెండ్ !
April 11, 2023
0
Tags