ఉత్తరప్రదేశ్ లో అరాచకం ప్రబలిపోయింది !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ లో అరాచకం ప్రబలిపోయిందని, తిఖ్ అహ్మద్ అతడి సోదరుడు ఆష్రఫ్‌లను దుండగులు కాల్చిచంపిన ఘటనతో రాష్ట్రంలో శాంతి భద్రతల వ్యవస్ధ కుప్పకూలిందని  పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిబంధనలతో నడిచే మన ప్రజాస్వామిక వ్యవస్ధలో ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలకు చోటు లేదని, యూపీలో అరాచక ఘటనలతో శాంతి భద్రతల వ్యవస్ధ కుప్పకూలడం చూసి తాను దిగ్భ్రాంతికి లోనయ్యానని మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. యూపీలో ప్రస్తుతం నేరస్తులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని పోలీసులు, మీడియా ఎదుటే చెలరేగుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ అతీక్‌ అహ్మద్‌, అతడి సోదరుడు అష్రఫ్‌ హత్య నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌  ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ విధించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)