మద్యపాన నిషేదం ఉన్న బీహార్ లోని మోతీహరి జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతి చెందారు. మరో 12 మంది తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రి పాలయ్యారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కల్తీ మద్యం సేవించినందు వల్లనే వీరంతా చనిపోయారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే, అధికార యంత్రాంగం మాత్రం ఇప్పటి వరకు ఈ మరణాలు కల్తీ మద్యం సేవించడం వల్లనే సంభవించాయన్న విషయాన్ని ధృవీకరించలేదు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత ఈ మరణాలకు కారణం ఏవిషయం అనేది చెబుతామని అధికారులు పేర్కొంటున్నారు.
కల్తీ మద్యానికి ఐదుగురు బలి
April 15, 2023
0