ఓ ప్రెస్ మీట్ లో కృష్ణ వంశీ మాట్లాడుతూ తెలుగునాట ఎక్కువ మంది ఆర్టిస్టులు లేరు.. నటీనటుల కొరత ఉందని, ఇంకా ఎక్కువ మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కావాలి అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఏడాదికి 60, 70 లు చేస్తుంటే.. అన్నింటికి ఆరు,ఏడుగురు మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు మాత్రమే ఉన్నారని కృష్ణవంశీ పేర్కొన్నారు. ఈ మాటలను కాస్త సీరియస్‌గా తీసుకున్నారు కోటా. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆర్టిస్టులు లేరని కృష్ణ వంశీ ఎలా మాట్లాడాతాడని ఫైరయ్యారు. అప్పుడు ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ సమయంలో తనను కాస్త పర్సనల్‌గా మాటలు అనేసరికి నేను కూడా అలానే రిప్లై ఇవ్వాల్సి వచ్చిందని కృష్ణవంశీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ తర్వాత కోటా గారికి సారీ చెప్పి, ఆ గ్యాప్ క్లియర్ చేసుకున్నట్లు చెప్పారు. ఆ సమయంలో తాను కొంచెం తొందర పడ్డందుకు పశ్చాతాప పడినట్లు తెలిపారు. ఆ గొడవలు సర్దుకున్నాకే ఆయనతో రాఖీ లో కలిసి పని చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగానే మాట్లాడిన కృష్ణ వంశీ, కోటా గారితో తన జర్నీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి సాగుతుందని తెలిపారు. ఆయన ఓ అద్భుత నటుడని, ఆయన్ను చూసి నేర్చుకోవాలని తాను పలువురు నటులకు సూచించినట్లు వివరించారు. ఆయన అత్యద్భుతమైన స్కిల్ ఉన్న అతి కొద్దిమంది నటుల్లో కోటా ఒకరని.. ఆయన అంటే తనకు విపరీతమైన గౌరవం ఉందని కృష్ణ వంశీ వెల్లడించారు.
Post a Comment
0Comments
3/related/default