సీనియర్ సినీ నటుడు శరత్ బాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను హైదరాబాద్‌లోని ఏఎంజీ ఆసుపత్రికి తరలించారు. కొంత కాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బెంగళూరు లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ఐసీయూలో ఉండి ట్రీట్ మెంట్ తీసుకున్నారు. బెంగళూరు ఆసుపత్రిలో ఆయన కొంత వరకు కోలుకున్నారని ఆయన సన్నిహితులు ప్రకటించారు. ఐసీయూ నుంచి సాధారణ విభాగానికి శరత్ బాబును మార్చినట్టు తెలుస్తోంది. అయితే బెంగళూరు హాస్పిటల్ లో ఉండగానే మరోసారి ఆయన పరిస్థితి విషమించినట్టు తెలిసింది. దాంతో శరత్ బాబును బెంగళూరు నుంచి హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శరత్ బాబు హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఆరోగ్య పరిస్థితి మెరుగు పడటంతో ఆయనను ఐసీయూ నుంచి జనరల్ రూంకు షిఫ్ట్ చేశారు.
ఏఎంజీ ఆస్పత్రికి శరత్ బాబు తరలింపు
April 22, 2023
0
Tags