సుడాన్‌ నుంచి భారతీయుల తరలింపు

Telugu Lo Computer
0


సుడాన్‌లో ఆర్మీ, పారామిలటరీ దళాల మధ్య భీకర పోరు జరుగుతున్నది. ఇప్పటికే సుమారు 500 మంది వరకు సాధారణ పౌరులు మరణించగా, 3,500 మంది గాయపడ్డారు. మృతుల్లో కొందరు భారతీయులు కూడా ఉన్నారు. సంక్షోభంలో ఉన్న సుడాన్‌లో సుమారు 4,000 మంది భారతీయులు చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో వీరిని సురక్షితంగా భారత్‌కు తరలించేందుకు 'ఆపరేషన్ కావేరి' మిషన్‌కు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సుమారు 500 మంది భారతీయులు సుడాన్‌ పోర్ట్‌కు చేరుకున్నారు. భారత నౌకా దళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ సుమేధ ఇప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్నది. సుడాన్‌లో చిక్కుకున్న భారతీయులను ఐఎన్‌ఎస్‌ సుమేధ, ఐఏఎఫ్‌ విమానాల ద్వారా భారత్‌కు తరలించే ప్రక్రియ సోమవారం ప్రారంభమైందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)