కేజ్రీవాల్ ఇంటి వద్ద అనుమానాస్పద డ్రోన్ సంచారం !

Telugu Lo Computer
0


ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ఇంటి సమీపంలో అనుమానాస్పద డ్రోన్ సంచరించడం కలకలం రేపింది. సీఎం కేజ్రీవాల్ ఇంటి సమీపంలో గుర్తుతెలియని డ్రోన్ సంచరించిందని ఢిల్లీ పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ డ్రోన్ ఎవరిదనే విషయంపై తాము దర్యాప్తు చేస్తున్నామని ఢిల్లీ పోలీసులు చెప్పారు. దేశరాజధానిలోని నో ఫ్లైయింగ్ జోన్ అయిన కేజ్రీవాల్ గృహంపై డ్రోన్ ఎగరడం భద్రతా ఉల్లంఘన అని పోలీసులు చెప్పారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)