మనస్థాపంతో యువతి ఆత్మహత్య

Telugu Lo Computer
0


తమిళనాడులోని కడలూరు జిల్లా అబతరణపురానికి చెందిన నిషా నీట్​కోసం నైవేలిలోని బైజుస్ కోచింగ్ సెంటర్​లో జాయిన్ అయింది. ఎప్పటిలాగే క్లాస్​కు వెళ్తున్నానని ఇంట్లోవాళ్లకు చెప్పి బయల్దేరిన ఆ యువతిని కోచింగ్ సెంటర్​ వాళ్లు స్పెషల్ బ్యాచ్​లో కూర్చునేందుకు అనుమతివ్వలేదు. దీంతో మనస్థాపం చెందిన నిషా వడలూరు స్టేషన్​కు చేరుకుని రైలు కింద దూకింది. ఆమెను గమనించి లోకో పైలట్ రైలును ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. రైల్వే పోలీసులు డెడ్​బాడీని పోస్టుమార్టానికి తరలించారు. తన కూతురి ఆత్మహత్యకు బైజుస్ కోచింగ్ సెంటరే కారణమని నిషా తండ్రి ఉతిరభారతి ఆరోపించారు. పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా స్టూడెంట్లను బ్యాచ్​లుగా వేరు చేయడంతో నిషా మనస్థాపం చెందిందని తెలిపారు. ''నిషాకు 399 మార్కులు వచ్చాయి. కానీ, 400 కంటే ఎక్కువ మార్కులు వచ్చినోళ్లకు మాత్రమే బైజుస్ వాళ్లు స్పెషల్ కోచింగ్​ ఇస్తున్నారు. ఇదే ఆమె డిప్రెషన్​కు కారణమైంది' అని ఉతిర భారతి చెప్పారు. కోచింగ్ సెంటర్​పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)