అతిక్ అహ్మద్ సోదరుల హత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ లో  శాంతిభద్రతల పరిరక్షణలో సీఎం యోగి విఫలమయ్యారనడానికి ఈ ఘటనే నిదర్శనం అన్నారు. అతిక్ అహ్మద్ సోదరుల హత్యలకు ప్రభుత్వమే కారణమని ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. అతిక్, అతని సోదరుడు పోలీసు కస్టడీలో ఉండగా చంపబడ్డారని, జేఎస్ఆర్ నినాదాలు కూడా చేశారని పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్ రాజ్‌ని జరుపుకునే వారు కూడా ఈ హత్యకు సమానంగా బాధ్యులన్నారు.  మరోవైపు అతిక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్‌ హత్యలపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా స్పందించారు. యూపీలో నేరాలు తారా స్థాయికి చేరాయన్నారు. నేరగాళ్ల నైతిక స్థైర్యం ఎక్కువగా ఉందని చెప్పారు. పోలీసు సిబ్బంది భద్రత మధ్య కాల్చి చంపబడినప్పుడు సాధారణ ప్రజల భద్రత పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దీని వల్ల ప్రజల్లో భయాందోళన వాతావరణం ఏర్పడుతోందని పేర్కొన్నారు. కొందరు కావాలనే ఇలాంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నారనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. 2005 బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఉమేష్ పాల్ హత్య కేసులో అతీక్ అహ్మద్ నిందితుడిగా ఉన్నాడు. శనివారం రాత్రి ప్రయాగ్‌రాజ్‌లో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా అతీక్ అహ్మద్, అష్రఫ్‌ను కాల్చి చంపారు. వైద్య పరీక్షల కోసం అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ ను పోలీసులు తీసుకెళ్తున్నారు. ఆ సమయంలో అక్కడికి మీడియా వచ్చింది. గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతలో వెనుక నుంచి కాల్పుల శబ్ధం వినిపించింది. దుండగులు నేరుగా అతిక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ పై కాల్పులు జరిపారు. దీంతో వారిద్దరు అక్కడికక్కడే మరణించారు. పోలీసు కస్టడీలో ఉండగానే వారిపై దుండగులు కాల్పులు జరిపారు. కాల్పులకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఈ కాల్పులకు పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)