మూడు తరాల వారికి ఆయనే హైయిర్‌ కట్‌ చేస్తున్నారు !

Telugu Lo Computer
0


దర్శకుడు మారుతి పెట్టిన పోస్ట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మారుతి వందేళ్ల వ్యక్తిని పరిచయం చేశారు. వాళ్ల సొంత ఊరులోని బార్బర్‌ ఫొటోలు షేర్‌ చేసి, ఆయన గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరలవుతున్నాయి. ''ఈ ఫొటోల్లోని వ్యక్తి పేరు సీతారామ రావు. మా సొంత ఊరు మచిలీపట్నంలో పనిచేసే బార్బర్‌. ఆయన వయసు వందేళ్లు. ఇంకా చురుకుగా రోజూ తన షాపుకు వచ్చి ఎంతోమందికి హైయిర్‌ కట్‌ చేస్తుంటారు. ఆయనకు తన వృత్తి అంటే చాలా గౌరవం. మా ఇంట్లో మా తాతయ్యకు, మా నాన్నకు ఇప్పుడు నాకు ఇలా మూడు తరాల వారికి ఆయనే హైయిర్‌ కట్‌ చేస్తున్నారు. ఇలాంటి వారు ఎంతోమందికి స్ఫూర్తి. మీరు ఆరోగ్యంగా ఉండాలి సీతారామ రావు గారు'' అంటూ ఆయనతో దిగిన ఫొటోలను పంచుకున్నారు. ఈ పోస్ట్‌ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 'గ్రేట్‌ పర్సన్‌' అని కామెంట్లు పెడుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మారుతి యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌తో ఓ సినిమా తీస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి వరుసగా అప్‌డేట్లు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా వీరిద్దరూ కలిసి సెట్‌లో ఉన్న ఫొటో ఒకటి నెట్టింట సందడి చేసిన విషయం తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)