రూ.2.10 కోట్ల నగదు పట్టివేత !

Telugu Lo Computer
0


కర్ణాటకలోని బాగలకోటె జిల్లా జమఖండి తాలూకా హున్నూర చెక్‌పోస్టు వద్ద లెక్కలు లేకుండా తరలిస్తున్న రూ.2.10 కోట్ల నగదును ఎన్నికల అధికారులు సీజ్‌ చేశారు. చెక్‌పోస్ట్‌లో అధికారులు ఒక కారును తనిఖీ చేయగా నగదు కట్టలు లభించాయి. ఈ నగదు ఒక సహకార బ్యాంకుకు చెందినదిగా నగదు తరలింపుదారులు తెలిపారు. అయితే అందుకు సంబంధించి దాఖలాలు చూపలేదని తెలిసింది. పత్రాలను చూపించి నగదు తీసుకెళ్లాలని అధికారులు సూచించారు. ఆ నగదును జమఖండిలోని ట్రెజరీకి తరలించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)