కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నాలుగు ప్రధాన హామీలను నెరవేరుస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ కన్నడిగులకు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వానికి చెందిన ప్రతి ఆర్ టీసీ బస్సులో మహిళలు ఉచితంగా సంచరించడానికి చర్యలు తీసుకుంటామని రాహుల్ గాంధీ అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే ఫైల్ మీద మా సీఎం సంతకం చేస్తారని రాహుల్ గాంధీ అన్నారు, గతంలో మేము చేసిన నాలుగు హామీలను ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చెయ్యాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి తెలిసింది ఒక్కటే, ఆదానికి విమానాశ్రయలు, ఓడరేవులు అప్పగించడం తప్పా మరో విషయం తెలియదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. మంగళూరులో మొట్ట మొదటిసారి ఓడరేవు ఏర్పాటు చేసింది అప్పటి ప్రధాన మంత్రి దివంగత ఇందిరా గాంధీ అని, అప్పటి నుంచి మా కుటుంబానికి, మంగళూరుకు అనుబంధం ఉందని రాహుల్ గాంధీ అన్నారు. కర్ణాటకలో ఇప్పుడు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 150 సీట్లలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వస్తామని, ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా ఎత్తునుల కన్నడిగులు ఏమాత్రం నమ్మరని, త్వరలో కర్ణాటక ప్రజలకు మంచిరోజులు వస్తాయని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, యువరాజు రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు.
మోడీకి రాహుల్ గాంధీ ఛాలెంజ్ !
April 28, 2023
0
Tags