వాచ్‌మెన్‌ని హత్య చేసిన డాన్సర్లు !

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రాఘవ గెస్ట్ హౌస్‌ నాలుగో అంతస్థులో అద్దెకు దిగారు. రాత్రి వారు మద్యం తాగి ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తుండంతో ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నించేందుకు వారి గదికి వాచ్‌మేన్ వెళ్లాడు. వాచ్‌మేన్‌తో గొడవకు దిగిన వారు.. అతన్ని మద్యం మత్తులో పై నుంచి కిందకు తోసేసినట్లు తెలిసింది. వాచ్‌మేన్ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన ఇద్దరు డాన్సర్లను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.చనిపోయిన వాచ్‌మేన్ పేరు యాదగిరి, వయసు 52 సంవత్సరాలు అని పోలీసులు తెలిపారు. ఆ డాన్సర్లు.. మద్యంతోపాటూ... డ్రగ్స్ కూడా వాడినట్లు అనుమానాలు ఉన్నాయి. పూర్తి దర్యాప్తు తర్వాతే ఏం జరిగిందో చెప్పగలం అని పోలీసులు అంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)