ఉత్తర ప్రదేశ్‌లో ఓ కన్నతల్లి తన ఇద్దరు చిన్నారులను దారుణంగా హత్య చేసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేసరికి ఆ చిన్నారుల తల, మొండెం వేరుగా పడున్నాయి. ఈ దారుణం ఘాజీపుర్ జిల్లాలోని మర్దా పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. హమీర్‌పుర్ బిజౌరా అనే గ్రామంలోని అజిత్ యాదవ్, నీతూ యాదవ్ దంపతులకు ముగ్గురు పిల్లలు. కుమార్తె పారీకి 9 ఏళ్లు కాగా, కుమారులైన హ్యాపీ (6), హార్దిక్ (10 నెలలు) చిన్నవాళ్లు. అజిత్ యాదవ్ జమ్మూలో ఆర్మీ జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి పిల్లలతో కలిసి నిద్రించడానికి తన గదిలోకి వెళ్లిన నీతూ యాదవ్ అదే రాత్రి కనికరం లేకుండా పసివాళ్లపై కత్తితో దాడి చేసింది. కుమారులు ఇద్దరి తలలు నరికేయగా.. కుమార్తె పారీ ప్రాణాలతో బయటపడింది. ఘాజీపుర్ ఎస్పీ ఓంవీర్ సింగ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నీతూ యాదవ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా.. నేరం అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. ఆమె మానసిక స్థితి సరిగా లేదని.. గత నాలుగైదేళ్లుగా చికిత్స తీసుకుంటోందని చెప్పారు. విషయం తెలిసిన వెంటనే నిందితురాలి భర్త అజిత్ యాదవ్ జమ్మూ నుంచి హుటాహుటిన ఘాజీపుర్‌కు వచ్చారు.
Post a Comment
0Comments
3/related/default