అక్కినేని కుటుంబంతో సమంతకు ఇప్పటికీ సాన్నిహిత్యం ఉందని చాలాసార్లు రుజువైన సంగతి తెలిసిందే. రానా, మిహికా, అఖిల్ సహా పలువురు అక్కినేని ఫ్యామిలీలో సమంత ఇప్పటికీ టచ్‌లో ఉంటుంది. ఇక తాజాగా నిన్న అఖిల్ బర్త్‌డే సందర్భంగా బెస్ట్ విషెస్‌ను అందించింది సమంత. గతేడాది కూడా అఖిల్ పుట్టిన రోజున సామ్ స్పెషల్ పోస్ట్ చేస్తూ విషెస్ చెప్పినా ఎందుకో అఖిల్ మాత్రం స్పందించలేదు. గతేడాది లాగే ఇప్పుడు కూడా సామ్ పోస్టును పట్టించుకోడు అంటూ కొందరు కామెంట్స్ చేశారు. కానీ వాళ్లందరికీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు అఖిల్. సమంతకు థ్యాంక్స్ చెబుతూ ఇన్‌స్టాలో షేర్ చేసుకున్నాడు. 'థ్యాంక్యూ సో మచ్ సామ్.. నీ అంచనాలను అందుకుంటానని అనుకుంటున్నా' అంటూ హార్ట్ ఎమోజీని జతచేశాడు. దీంతో అఖిల్ షేర్‌చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
సమంత పోస్టుకు రిప్లై ఇచ్చిన అఖిల్ !
April 09, 2023
0
Tags