అమెరికాలో డెల్టా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం మిన్నెయాపోలిస్ నుంచి అంకోరేజ్ కు బయలుదేరింది. ఈ విమానంలో అమెరికాలోని టెక్సాస్ నగరానికి చెందిన డేవిడ్ అలన్ బర్క్ (61) అనే ప్రయాణికుడు ఎక్కాడు. ప్లైట్ టేకాఫ్ కాకముందే ఎయిర్ హోస్టెస్ ను పిలిచి రెడ్ వైన్ అడిగాడు. అందుకు ఎయిర్ హోస్టెస్ నిరాకరించింది. నిబంధనలకు విరుద్దమని చెప్పింది. ప్లైట్ టేకాఫ్ అయ్యాక సర్వ్ చేస్తానని చెప్పింది. ప్లైట్ టేకాఫ్ అయ్యాక ఎయిర్ హోస్టెస్ అతనికి రెడ్ వైన్ సర్వ్ చేసింది. కొద్దిసేపటికి అలన్ బర్క్ మద్యం మత్తులోకి జారుకున్నాడు. మద్యం మత్తులో ఎయిర్ హోస్టెస్ ను పిలిచి ముద్దు పెట్టమని అడిగాడు. అందుకు ఎయిర్ హోస్టెస్ నిరాకరించడంతో బలవంతంగా ఆమె మెడను పట్టుకొని లాగి ముద్దు పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆమెను హత్తుకొనే ప్రయత్నం చేయడంతో పాటు దాడికి దిగాడు. కెప్టెన్ మీల్స్ తీసుకెళ్తున్న ట్రేలోని ప్లేట్ ను విరగగొట్టాడు. ఈ ఘటనపై బాధితురాలు ప్లైట్ సిబ్బందికి తెలియజేయగా విమానం అంకోరేజ్ కు చేరుకోగానే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
విమానంలో ఎయిర్ హోస్టెస్‌కు ముద్దుపెట్టిన ప్రయాణికుడు !
April 22, 2023
0
Tags