తమిళనాడు జిల్లాలో ఉండే కమలకన్ని వయసు 108. పుట్టింది, పెరిగింది తమిళనాడులోనే కానీ కూలీపనుల కోసం కేరళలోని ఇడుక్కి ప్రాంతానికి వలస వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయింది. జీవిత చరమాంకంలో అన్ని బాధ్యతలు అయిపోయాక ఇప్పుడు ఆమెకు చదువుకోవాలనిపించింది. పోయే ముందు ఒక్క పరీక్ష అయినా పాస్ అవ్వాలనుకున్నారు. తన కలను నిజం చేసుకున్నారు కూడా. పేదరికం వలన చిన్నప్పుడు చదువుకోలేకపోయారు కమలకన్ని. మిగతా ఏళ్ళంతా పోట్టకూటి కోసం శ్రమించారు. ఇప్పుడు ఏ పనీ చేయలేని వయసులో ఉన్నారు. ఇప్పుడు ఎందుకు చదువుకోకూడదని అనుకున్నారు. అంతే కేరళ ప్రభుత్వ నిరక్షరాస్యతా నిర్మాలనా కార్యక్రమంలో జాయిన్ అయిపోయారు. అందులోని సంపూర్ణ శాస్త్ర ప్రోగ్రామ్ లో రెండు భాషలు చదివి వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ రాశారు. పట్టుదలగా చదవి పాసయ్యారు. కమల కన్నికి 100 మార్కులుకు గానూ 97 మార్కులు వచ్చాయి. కలమకన్ని ఇప్పుడు తన మాతృభాష తమిళం, మలయాళంలో కూడా ప్రావీణ్యం సంపాదించుకున్నారు. ఆమె ఇప్పుడు రెండు భాసలు మాట్లాడగలరు, రాయగలరు, చదవగలరు.
108 ఏళ్ల వయసులోనూ చదువుకు ఏదీ అడ్డంకి కాదు !
April 10, 2023
0
Tags