అంచనాలకు మించి కలెక్షన్ రాబడుతున్న 'బలగం'

Telugu Lo Computer
0


జబర్దస్త్ కమెడియన్‌ వేణు డైరెక్టర్‌గా ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్‌ కీలక పాత్రలో నటించిన చిత్రం బలగం.  నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ఆయన కూతురు హన్షిత, హర్షిత్‌రెడ్డి నిర్మించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో తెరకెక్కిన ఈ చిత్రం  ఎలాంటి అంచనాలు లేకుండా 3న విడుదలైంది.  అయితే రిలీజైన మొదటి షో నుంచే సూపర్ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది బలగం . ప్రస్తుతం మనందరి జీవితాల్లో మాయమైపోతున్న కుటుంబ బంధాలను, ఆప్యాయతలను, ఎమోషన్స్‌ను కళ్లకు కట్టినట్లు ఈ చిత్రంలో చూపించారు. పలువురు సినీ ప్రముఖులు, విమర్శకులు కూడా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం వారం రోజుల్లోనే లాభాల బాట పట్టింది. మొదటి రోజు రూ.55 లక్షలు, రెండో రోజు రూ.80 లక్షలు రాబట్టగా మూడో రోజు వచ్చేసరికి ఏకంగా రూ.1.75 కోట్లు వసూలు చేసింది. ఇప్పటివరకు మొత్తంగా ఏడు కోట్ల మేర గ్రాస్‌ (రూ. 3.07 కోట్ల షేర్‌) రాబట్టినట్లు తెలుస్తోంది. ఓవరాల్‌గా కోటిన్నర ప్రీ రిలీజ్ బిజినెస్ టార్గెట్‌తో విడుదలైన బలగం ఫస్ట్ వీక్‌లోనే రూ.7 కోట్ల గ్రాస్‌ను, రూ.3 కోట్లకు పైగా షేర్‌ను రాబట్టింది. కాగా తెలంగాణ నేపథ్య కథాంశంతో రూపొందిన కావడంతో నైజాం ఏరియాలో ఈ చిత్రానికి భారీగా కలెక్షన్లు వస్తున్నాయి. ఇక ఈ విజయాన్ని పురస్కరించుకుని తాజాగా ఓ స్పెషల్‌ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. 'ఇది మన విజయం - కుటుంబ విజయం - చిన్న అందరూ మెచ్చే గొప్ప ' అంటూ ను సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. కాగా ఈ కు భీమ్స్‌ సిసిరోలియో అందించిన స్వరాలు చార్ట్‌ బస్టర్‌గా నిలిచాయి. అలాగే కాసర్ల శ్యాం అందించిన సాహిత్యం, మంగ్లీ ఆలపించిన పాటు బలగం కు హైలెట్‌గా నిలిచాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)