ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్,సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలతో బీజేపీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందంటూ హైదరాబాద్‌లో పోస్టర్లు వెలిశాయి. బీజేపీలో చేరకముందు, చేరిన తర్వాత అంటూ కొంతమంది బీజేపీ నేతల ఫొటోలతో ఈ పోస్టర్లు ఉన్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు నేతలు సీబీఐ,ఈడీ రైడ్స్ జరగగానే కాషాయరంగు పూసుకుని బీజేపీలో చేరిపోయారంటూ ఫ్లెక్సీల్లో ఇచ్చారు. ప్రస్తుత కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా, అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ, వెస్ట్ బెంగాల్ బీజేపీ ముఖ్య నేత సువేంధు అధికారి, ఆంధ్రప్రదేశ్ వ్యాపారవేత్త, ఎంపీ సుజనా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి నారాయణ్ రాణె ఫొటోలతో పోస్టర్లు వెలిశాయి. ఎమ్మెల్సీ కవిత రైడ్స్‌కి ముందు, తర్వాత కూడా ఎలాంటి మరకా అంటకుండా ఉన్నారని అర్థం వచ్చేలా ఈ ఫ్లెక్సీలూ, పోస్టర్లూ ఉన్నాయి. వీటిని బీఆర్ఎస్ కార్యకర్తలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. నిజమైన రంగులు వెలసిపోవు అనే కొటేషన్‌తో వెలిసిన పోస్టర్లు.. రాజకీయ కలకలం రేపుతున్నాయి. చివర్లో బై బై మోదీ అనే హ్యాష్ టాగ్‌తో పోస్టర్లన్నాయి.
బీజేపీకి వ్యతిరేకంగా హైదరాబాదులో వెలసిన పోస్టర్లు, ఫ్లెక్సీలు
March 11, 2023
0
Tags