హోటల్‌ భవనంలో మంటలు !

Telugu Lo Computer
0


ఒడిశాలోని పూరీ పట్టణంలో లక్ష్మీ మార్కెట్‌ కాంప్లెక్స్‌లో ఉన్న ఓ హోటల్‌ భవనంలో బుధవారం అర్థరాత్రి మంటలు చెలరేగాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన హోటల్‌ వద్దకు చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ మంటల్లో చిక్కుకున్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఆ ముగ్గురిని చికిత్స కోసం దగ్గరలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ హోటల్‌లో 140 మంది పర్యాటకులున్నారని ఛీప్‌ ఫైర్‌ ఆఫీసర్‌ రమేష్‌ మాఝీ మీడియాకు తెలిపారు. ఈ పర్యాటకుల్లో 30 మంది నాసిక్‌, ఇండోర్‌ నగరాలకు చెందినవారని, 110 మంది ఒడిశా, జైపూర్‌కు చెందినవారని వారిని మంటల నుంచి రక్షించి సురక్షితమైన ప్రదేశాలకు తరలించినట్లు మాఝీ వెల్లడించారు. ఈ అగ్నిప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియలేదని, చెలరేగిన మంటలను ఆర్పేందుకు 12 అగ్నిమాపక యంత్రాలతో 160 మంది రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు మాఝీ తెలిపారు. ఇక ఈ అగ్నిప్రమాదం వల్ల ట్రాఫిక్‌ సమస్యలేర్పకుండా.. ప్రత్యామ్నాయమార్గాల్లో వాహనదారుల్ని పంపించినట్లు ఎస్‌పి సింగ్‌ మీడియాకు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)