త్రాగు నీటి కోసం విద్యార్థుల కష్టాలు !

Telugu Lo Computer
0


ఒడిశాలోని నవరంగ్‌పూర్, ఉమర్కోటే బ్లాక్‌లో త్రాగు నీటి కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. రాంపర గ్రామంలోని ప్రభుత్వ నూతన ప్రాథమిక పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు సురక్షితమైన నీటి కోసం సుమారు 500 మీటర్లు నడవవలసి వస్తోంది. వేసవి కాలం సమీపిస్తుండటంతో వీరి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వీరి అవసరానికి తగిన స్థాయిలో నీరు అందుబాటులో ఉండటంలేదు.ఇక్కడ 1 నుంచి 5 తరగతుల వరకు ఉన్నాయి. మొత్తం మీద ఈ పాఠశాలలో 179 మంది చదువుతున్నారు. రాష్ట్రంలోని పాఠశాలలన్నిటికీ త్రాగునీరు సరఫరా అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని రాంపర గ్రామస్థులు చెప్పారు. అయితే తమ గ్రామంలోని పాఠశాలలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)