కెమికల్‌ స్క్రాప్ ను ఆటోలోకి ఎక్కిస్తుండగా పేలి ఒకరి మృతి

Telugu Lo Computer
0


హైదరాబాద్‌ సనత్‌నగర్‌లో పేలుడు కలకలం రేపింది. కెమికల్‌ స్ర్కాప్‌ను ఆటోలో లోడ్‌ చేస్తుండగా ఒక్కసారిగా పేలడంతో సంఘటనా స్థలంలో ఒకరు మృతి చెందారు. మూసాపేట్‌ హెచ్‌పీ రోడ్‌లోని గోదాములో స్క్రాప్ ను ఆటోలోకి ఎక్కిస్తుండగా ఓ కెమికల్‌ డబ్బా కిందపడటంతో ఈ పేలుడు జరిగినట్టు చెబుతున్నారు. మరణించిన వ్యక్తిని ముషీరాబాద్‌ బోలక్‌పూర్‌కి చెందిన మహ్మద్‌ నజీర్‌గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.  మృతుడు నజీర్ తండ్రి ఇస్మాయిల్ స్క్రాప్ కొనుగోలు చేస్తుంటాడని, అలా స్క్రాప్ కొనుగొలు చేసేందుకు వచ్చిన క్రమంలో ఈ ఘటన జరిగిందని సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సనత్‌నగర్ ఎస్‌ఐ చంద్రయ్య వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)