తమిళనాడులోని ధర్మపురి జిల్లా మరందనహళ్లిలో మంగళవారం కంచె దాటుతుండగా విద్యుత్ షాక్ తగిలి మూడు ఏనుగులు అక్కడిక్కడే మృతి చెందాయి. కాళీ కౌండర్ కొట్టాయ్ గ్రామంలో అడవి పందుల నుంచి పంటను కాపాడుకోవటానికి ఓ రైతు తన పొలానికి కంచె వేశారు. ఆ కంచెకు విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేశాడు. ఈక్రమంలో కంచె దాటటానికి ఏనుగుల గుంపు యత్నించింది. దీంతో విద్యుత్ ఘాతానికి గురి అయిన మూడు ఏనుగులు అక్కడికక్కడే మృతి చెందాయి. తమిళనాడులో రైతులు జంతువుల నుంచి తమ పంటను కాపాడుకోవటానికి తమ పొలాలకు ఇనుప కంచెలు ఏర్పాటు చేసుకుంటారు. ఆయా ప్రాంతాల్లో సంచరించే ఏనుగుల గుంపులు కంచెలను దాటుకుని..రోడ్లు దాటి సంచరిస్తుంటాయి. ఆహారం కోసం నీటి కోసం ఏనుగుల గుంపు సంచరిస్తుంటుంది. ఈక్రమంలో కొంతమంది రైతులు అక్రమంగా కంచెలకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలకు తగిలి ఇలా ఏనుగులు ప్రాణాలు కోల్పోతుంటాయి. కాగా అక్రమంగా కంచెలకు విద్యుత్ ఏర్పాటు చేయటం వలన ఏనుగులు మృతి చెందిన ఘటనపై అటవీశాఖ అధికారులు సదరు రైతులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే అటవీ జంతువులకు ఎటువంటి ప్రమాదం జరిగినా దానికి సంబంధించిన వ్యక్తులపై చర్యలు తీసుకోటం జరుగుతుంటుంది.
కరెంట్ షాక్ గురై మూడు ఏనుగులు మృతి !
March 07, 2023
0
Tags