మహారాష్ట్ర ఎమ్మెల్యేకు నాసిక్ సెషన్స్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రభుత్వం ఉద్యోగిపై దాడి, ఉద్దేశపూర్వకంగా అవమానించడం వంటి ఆరోపణలపై మహారాష్ట్ర అచల్ పూర్ ఎమ్మెల్యే ఓం ప్రకాశ్ అలియాస్ బచ్చు బాబురావు కడుకు రెండేళ్ల జైలు శిక్షతో పాటు..రూ. 10 వేల జరిమానా విధించారు. 2017 జులై 24న ప్రభుత్వ ఉద్యోగిపై ఎమ్మెల్యే ఓంప్రకాశ్ దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో సెషన్స్ కోర్టు ఆయనకు శిక్ష వేసింది. జులై 24, 2017న ప్రత్యేక వికలాంగులకు కేటాయించిన మూడు శాతం నిధులను వినియోగించకపోవడంపై నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ బయట ప్రహార్ సంస్థ ఆందోళనకు దిగింది. ఈ సమయంలో అప్పటి నాసిక్ సివిక్ చీఫ్ అభిషేక్ కృష్ణను ఓం ప్రకాశ్ దుర్భాషలాడు. దీనిపై అభిషేక్ కృష్ణ ఫిర్యాదు చేయడంతో ఓం ప్రకాశ్ పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇన్నాళ్లకు సెషన్స్ కోర్టు అతనికి శిక్ష విధించింది. ఈ కేసులో నాసిక్ సెషన్స్ కోర్టు తనకు శిక్ష విధించడంతో ఎమ్మెల్యే ఓం ప్రకాశ్ బెయిల్ కోసం హైకోర్టుకు దరఖాస్తు చేశారు. హైకోర్టులో ఎమ్మెల్యే తరపున న్యాయవాది వాదనలు వినిపించడంతో బెయిల్ మంజూరు చేసింది. నాసిక్ సెషన్స్ కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తానని ఎమ్మెల్యే ఓం ప్రకాశ్ తెలిపారు. ప్రభుత్వ అధికారులు తమ విధులను తప్పించుకునేందుకు ఐపీసీ సెక్షన్ 353 కవచంగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. సెక్షన్ 353కి సవరణ కోసం తాను ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేతో పాటు..ఇతర ఎమ్మెల్యేలను కలుస్తానని చెప్పారు.
ఎమ్మెల్యేకు రెండేళ్ల జైలు శిక్ష !
March 09, 2023
0
Tags