ఉత్తరప్రదేశ్ లోని సినౌలీ గ్రామానికి చెందిన ప్రియాంక్ అనే వ్యక్తి దొంగతనం చేద్దామని గత ఆదివారం రాత్రి ఓ ఇంటికి వెళ్లాడు. బంగారు నగలు, డబ్బు కోసం వెతుకుతుండగా, మద్యం బాటిల్ కనిపించింది. ఇంకేముంది దాన్ని చూశాక వచ్చిన పనేంటో కూడా మర్చిపోయాడు. మెల్లగా మొదలుపెట్టి బాటిల్ మొత్తం ఖాళీ చేసేశాడు. మత్తులో అక్కడే తూలిపోతూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. నిద్రలో నుంచి మెళుకువ వచ్చింది. కానీ అప్పటికే పూర్తిగా తెల్లారిపోయింది. అప్పుడు అతడికి రాత్రి జరిగిన విషయమంతా గుర్తొచ్చింది. వెంటనే అక్కడి నుంచి తప్పించుకొని పారిపోవాలని అనుకున్నాడు. గోడ దగ్గరకు వెళ్లి పారిపోయిందేకు ట్రై చేశాడు. కానీ గోడ దూకుతుండగా ఆ ఇంట్లోని వారు, చుట్టుపక్కల వారు వచ్చి పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అతడిపై కేసు నమోదు చేసుకున్నారు.
దొంగతనానికి వచ్చి మందుకొట్టి పట్టుబడ్డాడు !
March 09, 2023
0
Tags