భారత్ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ విడుదల చేసిన ప్రకటన హిందూ మనోభావాలను దెబ్బతీసేలా ఉందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విటర్‌లో భారత్ మ్యాట్రిమోని బాయ్‌కాట్ ట్రెండ్ అవుతోంది. 'చాలా మంది మహిళలు వేధింపులు హోలీ పండుగను జరుపుకోవడం మానేశారు. హోలీ మహిళల జీవితాన్ని ఎలా కష్టతరం చేసిందో ఈ వీడియో చూడండి. ఈ హోలీ, మహిళా దినోత్సవాన్ని జరుపుకుందాం, ప్రతి రోజు వారిని సురక్షితంగా భావించేలా చేద్దాం' అంటూ భారత్ మ్యాట్రిమోనీ తన ప్రకటనను విడుదల చేసింది. దీనిపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. హోలీ లాంటి హిందూ పండుగను కించపరచారని మ్యాట్రిమోనియల్ సైట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక అవగాహన ఎజెండాను మీరు హోలీ వంటి హిందూ పండుగను ఉపయోగించుకున్నందుకు సిగ్గుపడాలని ఓ ట్విట్టర్ వినియోగదారుడు ట్వీట్ చేశారు. 'వీలైనంత త్వరగా ఈ ప్రకటనను తీసివేయాలని, మీ సైట్‌ను మూసివేయబడకముందే' అని మరో నెటిజన్ హెచ్చరించారు. భారత్ మ్యాట్రిమోనీ దీనిపై ఇంకా స్పందించలేదు.
బాయ్‌కాట్ భారత్ మ్యాట్రిమోనీ
March 08, 2023
0
Tags