ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఇత్తెహాద్ మిల్లత్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు మౌలానా తౌకీర్ రజా మాట్లాడుతూ హిందూ రాష్ట్రాన్ని డిమాండ్ చేసేవారిని వ్యతిరేకించారు. హిందూ రాష్ట్రాన్ని డిమాండ్ చేయడం సరైనదే అయితే, ఖలిస్తాన్ డిమాండ్ చేసేవారు కూడా సమర్థించబడతారని అన్నారు. ఇదే కొనసాగింపులో రేపు ముస్లిం యువత ప్రత్యేక ఇస్లాం దేశాన్ని డిమాండ్ చేయడం ప్రారంభిస్తే అప్పుడు ఏమి జరుగుతుందంటూ ఆయన ప్రశ్నించారు. మన దేశ విభజనను మరోమారు కోరకోవడం లేదని, కానీ లౌకిక విలువల మీద ఏర్పడ్డ దేశం, వాటిని కాపాడుకుంటూ ముందుకు వెళ్లాలన్నదే తమ అభిమతమని మౌలానా తౌకీర్ అన్నారు. ''ఖలిస్తాన్ డిమాండ్ చేస్తున్న వారిపై దేశ ద్రోహం కేసులు పెట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదే విధంగా, అతను హిందూ రాష్ట్రాన్ని డిమాండ్ చేసే వారిపై దేశద్రోహం కేసు నమోదు చేసి చర్య తీసుకోవాలి. హిందూ రాష్ట్రాన్ని డిమాండ్ చేయడంపై ఎటువంటి చర్య తీసుకోనప్పుడు, ఖలిస్తాన్ డిమాండ్ చేయడం కూడా న్యాయమేనని పరిగణించబడుతుంది'' అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పేరును తౌకీర్ రజా ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. ముస్లింలు, ఇస్లాం మతాల వారిని మోడీ ప్రభుత్వం శత్రువులుగా చూస్తోందని, తమను నిత్యం కాల్చి వేస్తూ తమ శరీరాలను తూట్లు పొడుస్తున్నారని తౌకీర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ధృతరాష్ట్రుడు అని తౌకీర్ దుయ్యబట్టారు. తమ మాటల్ని మహిళా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సీరియస్‌గా తీసుకుంటారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. హిందూ మహిళల్ని ముస్లింలుగా మారుస్తున్నారంటూ దేశంలో కొనసాగుతున్న విస్తృత చర్చ నడుమ ముస్లిం బాలికల్ని అపహరించి మతం మారుస్తున్నారంటూ తౌకీర్ ఆరోపించడం గమనార్హం. ఇప్పటికే సుమారు పది లక్షల మంది ముస్లిం బాలికల్ని కిడ్నాప్ చేసి మతం మార్చారని ఆయన అన్నారు. కానీ ప్రభుత్వం వీటిపై చర్యలు తీసుకోవడం లేదని, ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని తాము సహించబోమన్నారు. ''హిందూ సంస్థలు సుమారు 10 లక్షల మంది ముస్లిం బాలికలను అపహరించి, బెదిరించి, ప్రలోభపెట్టి, హిందూ మతంలోకి మార్చారు. ఘర్ వాప్సీ అనే పేరుతో వారిని హిందూ అబ్బాయిలు పెళ్లిళ్లు చేసుకున్నారు'' అని ఏదో సర్వే వెల్లడించినట్లు మౌలానా తౌకీర్ పేర్కొన్నారు.
మౌలానా తౌకీర్ రజా వివాదాస్పద వ్యాఖ్యలు !
March 12, 2023
0
Tags