హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు !

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇందిరా పార్క్ నుంచి వీఎస్టీ వరకు చేపట్టిన స్టీల్ బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేసేందుకు ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు మార్చి 10 నుంచి జూన్ 10 వరకు అమలులో ఉంటాయి. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా బ్రిడ్జికి ఇరువైపులా రోడ్లు మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ అదనపు కమిషనర్ సధీర్ బాబు చెప్పారు. బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. చిక్కడపల్లి నుంచి ఆర్టీసీ ఎక్స్ రోడ్డు మీదుగా అశోక్ నగర్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను సుధా నంది హోటల్ లేన్, చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ మీదుగా అశోక్ నగర్ ఎక్స్ రోడ్, ఇందిరాపార్క్ వైపు మళ్లిస్తారు. విఎస్టీ నుంచి ఆర్టీసీ ఎక్స్‌ రోడ్డు మీదుగా అశోక్ నగర్ వైపు వచ్చే ట్రాఫిక్ ఆర్టీసీ ఎక్స్‌ రోడ్ వద్ద హెబ్రాన్ చర్చి లేన్, ఆంధ్రా కేఫ్, జగదాంబ హాస్పిటల్, అశోక్ నగర్ ఎక్స్‌ రోడ్ మరియు ఇందిరా పార్కుల మీదుగా మళ్లిస్తారు. ఇందిరాపార్క్‌ నుంచి ఆర్టీసీ ఎక్స్‌ రోడ్డు వైపు వచ్చే ట్రాఫిక్‌ను అశోక్‌నగర్‌ ఎక్స్‌ రోడ్డులో జగదాంబ హాస్పిటల్‌ రైట్‌ టర్న్‌, ఆంధ్రా కేఫ్‌, హెబ్రోన్‌ చర్చి, చిక్కడపల్లి మెయిన్‌ రోడ్డు మీదుగా మళ్లిస్తారు. ఇందిరాపార్క్‌ నుంచి ఆర్టీసీ ఎక్స్‌ రోడ్డు వైపు వచ్చే ట్రాఫిక్‌ను అశోక్‌నగర్‌ ఎక్స్‌ రోడ్డు వద్ద వీధి నంబర్‌ 9, సిటీ సెంట్రల్‌ లైబ్రరీ, సుధా నంది హోటల్‌ లేన్‌, చిక్కడపల్లి ప్రధాన రహదారి మీదుగా మళ్లిస్తారు. ఆర్టీసీ ఎక్స్‌ రోడ్డు వైపు వచ్చే ట్రాఫిక్ ఆర్ సీ రెడ్డి లేన్ వద్ద, జగదాంబ హాస్పిటల్, ఆంధ్రా కేఫ్, హెబ్రాన్ చర్చి మరియు చిక్కడపల్లి ప్రధాన రహదారి వైపు పంపుతారు. ఆర్టీసీ ఎక్స్ రోడ్డు వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను అశోక్ నగర్ చమన్, సిటీ సెంట్రల్ లైబ్రరీ, సుధా నంది హోటల్ లేన్, చిక్కడపల్లి ప్రధాన రహదారి వద్ద మళ్లిస్తారు. జూన్ 10 వరకు పైన పేర్కొన్న మార్గాలను నివారించి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు పౌరులను అభ్యర్థించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)