భార్యను ముక్కలు ముక్కలుగా నరికి చంపాడు !

Telugu Lo Computer
0


చత్తీస్‌గఢ్ లోని బిలాస్‌పూర్ జిల్లాలో పది సంవత్సరాల క్రితం పవన్ సింగ్, సాథి సాహు అనే యువతి యువకుడు ప్రేమ పెళ్లి చేసుకొని నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యపై అనుమానం రావడంతో ఆమెతో అతడు పలుమార్లు గొడవపడ్డాడు. పవన్ సింగ్ నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న విషయం తెలియడంతో అతడిని ఆమె ప్రశ్నించింది. ఇద్దరు మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో ఇద్దరి పిల్లలను అమ్మమ్మ వాళ్ల ఇంటికి పంపించారు. జనవరి 6న భార్యను గొంతు నులిమి చంపేశాడు. కట్టర్ సహాయంలో భార్యను ముక్కలు ముక్కలుగా నరికి వాటర్ ట్యాంక్‌లో పడేశాడు. ట్యాక్ నుంచి వాసన రాకుండా టేప్‌తో చుట్టాడు. నకిలీ నోట్ల తయారి వ్యవహారం బయటకు రావడంతో పోలీసులు పవన్ సింగ్ ఇంటికి వచ్చారు. ఇంట్లో ఉన్న నకిలీ నోట్ల తయారీ మిషన్‌తో పాటు నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. డ్రమ్ము వద్దకు రాగానే దుర్వాసన రావడంతో తెరిచి చూశారు. డ్రమ్ములో శరీర భాగాలు కనిపించడంతో వెంటనే పవన్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)