రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఈ ప్రేమ జంట జైకుపై చెప్పుకున్న ప్రేమ ముచ్చట్లను ప్రదీప్ షెకావత్ అనే వ్యక్తి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. రాయల్ ఎన్‌ఫీల్డ్ నడుపుతున్న యువకుడిని అతనికి అభిముఖంగా కూర్చున్న యువతి కౌగిలింతలతో ప్రేమ వర్షం కురిపించడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. అయితే రోడ్డు భద్రతా నిబంధనలకు విరుద్ధంగా వీరు ప్రవర్తించడమే చర్చనీయాంశంగా మారింది. రోడ్డుపై ఇదేమి ప్రేమంటూ నెటిజన్లు మండిపడుతూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో పోలీసుల దృష్టికి కూడా వెళ్లింది. బైకు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా ఆ ప్రేమ జంట ఆచూకీ కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఏదేమైనా ఇలాంటి దృశ్యాలు ఇప్పుడు సర్వసాధారణమైపోయాయి. ఫిబ్రవరిలో రాజస్థాన్‌లోని అజ్మీర్ నగరంలో ఒక ప్రేమ జంట బైకులో కూర్చుని ముద్దులతో ముచ్చట్లు చెప్పుకుంటున్న వీడియో కూడా అప్పట్లో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.
బైకుపై ప్రేమికుల సరస సల్లాపాలు !
March 10, 2023
0
Tags