తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంచుపల్లి మండలం రాంపురంలో మొక్కజొన్న గింజలు తింటూ మూడేళ్ల చిన్నారి బిందుశ్రీ చనిపోయింది. ఊపిరితిత్తుల్లో మొక్కజొన్న గింజలు ఇరుక్కోవడంతో శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడిన చిన్నారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నం వృథా అయిపోయింది. ఊపిరి ఆడక ఆ చిన్నారి ప్రాణాలు విడిచింది. చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లిదండ్రుల రోధనలు మిన్నంటాయి. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. వారి బాధను చూసిన వారు సైతం కన్నీరు పెట్టుకుంటున్నారు.
మొక్కజొన్న గింజలు తింటూ చిన్నారి మృతి !
March 09, 2023
0
Tags