ఉర్ఫీ జావేద్ తన వస్త్రాలంకరణతో ఎప్పుడూ నెటిజన్ల టార్గెట్‌లో ఉంటోంది. ఇప్పుడు ఉర్ఫీ జావేద్ కొత్త హాట్ లుక్ తో మరో సారి వార్తల్లో నిలిచింది. ఉర్ఫీ ఫోటోలు చూసి అందరూ షాక్ అవుతున్నారు. తాజాగా ఉర్ఫీ ఓ పోస్ట్‌ను సోషల్ మీడియాతో పంచుకున్నారు. ఈ పోస్టులో వెదురు బుట్ట నుంచి తయారు చేసిన వస్త్రాలను ధరించినట్లు తెలుస్తోంది. ఫ్యాషన్ డిజైనర్లు ప్రత్యేకంగా వెదురు తాడులను ఉపయోగించి అందమైన డ్రెస్ తయారు చేశారు. ఉర్ఫీ జావేద్ కొత్త స్టైల్ చూసి అందరూ షాక్ అయ్యారు. ఉర్ఫీ జావేద్ లుక్ చూసిన నెటిజన్లు ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు. వెదురు తాడులను ఉపయోగించి అందమైన కుండలు, కుర్చీలు, బల్లలు ఎలా తయారు చేస్తారని తెలుసు కానీ, నేను ఇది చూసి ఆశ్చర్యపోతున్నాను అని ఒకరు కామెంట్ చేశారు. బిగ్ బాస్ ఓటీటీ నుండి ఉర్ఫీ జావేద్‌కు గుర్తింపు వచ్చింది. బట్టల కారణంగా ఉర్ఫీ జావేద్‌కు తరచూ హత్య బెదిరింపులు వస్తున్నాయి.
వెదురు బుట్టలతో ఉర్ఫీ జావేద్ వస్త్రాలంకరణ !
March 12, 2023
0
Tags