మహిళ స్నానం చేస్తుండగా నగ్న దృశ్యాల చిత్రీకరణ !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు సిటీలోని సర్వజన వైద్యశాలలో ఆదివారం మధ్యాహ్నం న్యూడ్ వీడియో ఉదంతం కలకలం రేపింది. నిందితుడి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న స్థానికులు చితకకొట్టారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం నల్వకాల్వకు చెందిన ఏలియా అనే వ్యక్తి తన మిత్రుడిని చూసేందుకు హాస్పిటల్‌కు వచ్చాడు. రోగి సహాయకురాలు బాత్రూంలో ఉండగా, గోడపైకి ఎక్కి సెల్‌ఫోన్‌లో వీడియోలు తీశాడు. ఆమె అది గమనించి  గట్టిగా కేకలు వేయడంతో ఆసుపత్రిలో ఉన్నవారు అతన్ని పట్టుకొని చితకబాదారు.  ఏలియాను ఆసుపత్రి భద్రతా సిబ్బంది పోలీసులకు అప్పగించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)