సతీశ్‌ కౌశిక్‌ మరణంపై అనుమానాలు !

Telugu Lo Computer
0


బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సతీశ్‌ కౌశిక్‌ మరణంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ నెల 8న రాత్రి ఢిల్లీలోని ఓ ఫాంహౌస్‌లో హోలీ వేడుకలు జరుపుకొన్న ఆయన అర్ధరాత్రి దాటిన తర్వాత ఆనారోగ్యానికి గురై మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫాంహౌస్‌ యజమాని వికాస్‌ మాలు రెండో భార్య సంచలన ఆరోపణలు చేశారు. తన భర్తకు, సతీశ్‌ కౌశిక్‌కు డబ్బు విషయంలో గొడవ జరిగిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే సతీశ్‌ మరణంపై అనుమానం వచ్చి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ''సతీశ్‌కు, నా భర్తకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి. గతంలో ఇచ్చిన రూ.15 కోట్లు తిరిగివ్వాలని నా భర్తను సతీశ్‌ కౌశిక్‌ గత ఆగస్టులో విదేశాల్లో వుండగా అడిగారు. భారత్‌కు వచ్చిన తర్వాత ఇస్తానని నా భర్త చెప్పారు. సతీశ్‌ నుంచి తీసుకున్న డబ్బు కరోనా సమయంలో నష్టాల వల్ల పోగొట్టుకున్నానని నా భర్త నాతో చెప్పారు. వయాగ్రా ఔషధాలు, రష్యన్‌ అమ్మాయిలను ఉపయోగించి కౌశిక్‌ సమస్యను పరిష్కరించుకుంటానని నాతో అన్నారు. ఈ విషయాలన్నీ ఢిల్లీ పోలీసులకు తెలిపాను'' అని వికాస్‌ భార్య చెప్పారు. ఈ ఆరోపణలపై విచారణ చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)