పావురాలకు ఆహారం వేస్తే రూ. 500 జరిమానా !

Telugu Lo Computer
0


పావురాలకు ఆహారం వేస్తే రూ. 500 జరిమానా విధిస్తామని మహారాష్ట్రలోని థానే మున్సిపల్ కార్పొరేషన్ (టీఎంసీ) ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. పావురాల వద్దకు వెళ్లొద్దని, వాటిని నివాస ప్రాంతాలకు దగ్గరకు రానివ్వొద్దని టీఎంసీ ప్రజలకు సూచించింది. పావురాల వల్ల ఊపిరితిత్తుల వ్యాధి అయిన హైపర్ సెన్సిటివ్ న్యూమోనియా సంక్రమిస్తుందని తెలిపింది. ఈ న్యూమోనియా భారిన పడకుండా ప్రజలకు టీఎంసీ అవగాహన కల్పిస్తుంది. పోస్టర్ల ద్వారా ఇంటింటికి హెచ్చరికలు సైతం జారీ చేసింది. పావురాలు అలెర్జీలు, ఇన్ఫెక్షన్‌లకు దారితీస్తాయని ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఈ విషయాన్ని కొన్ని శాస్త్రీయ పరిశోధనలుకూడా ధృవీకరించాయి. పావురం పెంపకందారుల్లో హైపర్సెన్సిటివిటీ న్యూమోనైటిస్ వ్యాధి భారినపడుతున్న వారి సంఖ్య ఎక్కువే. అయితే, పావురాల పెంపకం దారులు పావురపు రెట్టలు శుభ్రం చేసే సమయంలో, వలలు అమర్చే సమయంలో తప్పనిసరిగా మాస్క లు ధరించాలని, చేతికి గ్లౌజులు వేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)