వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావుకు అరుదైన గౌరవం దక్కనుంది. ఎన్టీఆర్ అందించిన సేవలకు గుర్తుగా ఆయన బొమ్మతో రూ.100 కాయిన్ ముద్రించాలని కేంద్రం నిర్ణయించింది. త్వరలో ఎన్టీఆర్ బొమ్మతో రూ.100ల కాయిన్ రానుంది. పూర్తిగా వెండితో రూ.100 కాయిన్ తయారు కానుంది. ఈ సందర్భంగా మింట్ అధికారులు దగ్గుబాటి పురందేశ్వరిని కలిశారు. నమూనాను చూపించి అధికారులు సలహా కోరారు. పురందేశ్వరికి వారు ఈ వెండి నాణేన్ని, దానిపై ఎన్టీఆర్ బొమ్మ మోడల్ ను చూపించారు. ఈ నమూనాకు పురందేశ్వరి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఎన్టీఆర్ బొమ్మతో ఈ రూ.100 నాణెం బయటికి రానుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)