హైదరాబాద్ కూకట్ పల్లిలో ఎక్స్ సీఎస్పీఎల్ పేరుతో వెలిసిన క్రిప్టో కరెన్సీ కంపెనీ కోట్లాది రూపాయలు దండుకుంది. లక్ష పెట్టుబడితో 3 నెలల్లో 4 లక్షల లాభం అంటూ ఎరవేసి డబ్బులు తీసుకుంది. నాలుగు రెట్లు లాభమంటూ ఒక్కొక్కరి నుంచి లక్ష నుంచి పది లక్షల వరకు వసూలు చేసింది. అప్పు చేసి, లోన్ తీసుకొని, క్రెడిట్ కార్డులు వాడి బాధితులు పెట్టుబడి పెట్టారు. రోజులు గడుస్తున్నా లాభాలు రాకపోవడంతో బాధితుల్లో అనుమానం మొదలైంది. ఇదిగో అదిగో అంటూ నెట్టుకొస్తుండడంతో నిలదీశారు. దీంతో గొడవ పెద్దదైంది. మీడియా చెవిన పడింది. దీనిపై వివరాలు అడిగితే ఎక్స్ సీఎస్పీఎల్ కంపెనీ నిర్వాహకులు సరిగ్గా స్పందించడం లేదు. కేసు ఫైల్ అయిందని తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఉద్యోగాల పేరుతో ముందు వల వేశారు. కొందరు నిరుద్యోగులను చేర్చుకున్నారు. వారి చేత పెట్టుబడి పెట్టించారు. పనిచేస్తున్న కంపెనీ కావడం, డబ్బులు నాలుగు రెట్లు ఇస్తామని చెప్పడంతో ఉద్యోగులు ఇన్వెస్ట్ చేశారు. అక్కడి నుంచి వారికి పరిచయం ఉన్న వారి చేత కూడా పెట్టుబడి పెట్టించారు. తమ ఉద్యోగానికి ఏం ఇబ్బంది వస్తుందోనని నిర్వాహకులు చెప్పినట్టే వారికి తెలిసిన వారి చేత డబ్బులు కట్టించారు. ఎంతకీ డబ్బులు తిరిగి రాకపోవడంతో మోసపోయామని గ్రహించి బాధితులు మీడియా ముందుకొచ్చారు.
క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం !
February 15, 2023
0
Tags