దేశంలో సౌరశక్తిని ప్రోత్సహించేందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ సోలార్ రూఫ్‌టాప్ సోలార్ పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్‌లో డిస్కమ్ ప్యానెల్‌లో చేర్చబడిన ఏదైనా విక్రేత నుండి ఇంటి పైకప్పుపై సోలార్ పీనల్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందవచ్చు. ఉదాహరణకు 3 కిలోవాట్ల సోలార్ ప్యానెల్‌ను అమర్చినట్లయితే, దాని ధర సుమారు 70-75 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇందులో ప్రభుత్వం నుంచి 20 శాతం సబ్సిడీ లభిస్తుంది. ఇంటికి రెండు కిలోవాట్ల సోలార్ ప్యానల్ అమర్చుకుంటే రూ.1.20 లక్షలు ఖర్చవుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందిన తర్వాత కేవలం 72 వేల రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. 500 కెవి వరకు సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటుపై ప్రభుత్వం నుండి 20 శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది. సోలార్ రూఫ్‌టాప్ ప్లాన్‌లో 25 సంవత్సరాల పాటు సోలార్ ప్యానెల్‌లను ఉపయోగించవచ్చు. ఈ పథకంలో ఖర్చు చెల్లింపును 5 నుండి 6 సంవత్సరాలలో పూర్తిగా రికవరీ అవుతుంది. ఈ పథకం ద్వారా, కేంద్ర ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రీన్ ఎనర్జీ విషయంలో మోడీ ప్రభుత్వం చాలా వేగంగా పని చేస్తోంది. ఫిబ్రవరిలో సమర్పించిన సాధారణ బడ్జెట్2023 లో సౌరశక్తికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చింది. సోలార్ ప్యానెల్స్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి మీ వద్ద కొన్ని పత్రాలు ఉండాలి. ఉదాహరణకు 1 కిలోవాట్ సోలార్ ప్యానెల్ కోసం దాదాపు 10 చదరపు మీటర్ల స్థలం అవసరం. మీరు తప్పనిసరిగా శాశ్వత నివాస కార్డును కలిగి ఉండాలి. అంటే ఆధార్ కార్డు, పాన్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ ఏదైనా ఉండాలి. ఆదాయ ధృవీకరణ పత్రంతో పాటు, విద్యుత్ బిల్లు డిపాజిట్ రసీదు. సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయనున్న పైకప్పు ఫొటో ఇవ్వాల్సి ఉంటుంది.
ఇంటికి సోలార్ రూఫ్‌టాప్ !
February 13, 2023
0
Tags