అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ నుంచి 220 విమానాల కొనుగోలుకు ఎయిరిండియా ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా స్పందించారు. దీనిని ఓ చారిత్రక ఒప్పందంగా ఆయన అభివర్ణించారు. 220 బోయింగ్ విమానాలను కొనుగోలు చేసేందుకు ఎయిరిండియా ఒప్పందం కుదుర్చుకుందని, ఈ ఒప్పందంతో అమెరికాలోని 44 రాష్ట్రాల్లో స్థానిక యువత ఉపాధి అవకాశాలు పెరుగుతాయని జో బైడెన్ వెల్లడించారు. అంతేకాదు, ఇందులో చాలామందికి నాలుగేళ్ల డిగ్రీ కూడా అవసరం ఉండదని తెలిపారు. ఈ ఒప్పందం అమెరికా-భారత్ మధ్య ఉన్న బలమైన వాణిజ్య బంధాన్ని తెలియజేస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడానికి, ప్రజలకు సురక్షితమైన భవిష్యత్తు అందించడానికి ప్రధాని మోడీతో కలిసి భారత్‌తో మరింత దృఢమైన బంధాన్ని అమెరికా కోరుకుంటోందని జో బైడెన్ వెల్లడించారు.
ఇదో చారిత్రక ఒప్పందం : జో బైడెన్
February 15, 2023
0
Tags