ప్రేమికుల దినోత్సవం రోజు విషాదం !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ కి చెందిన దంపతులైన సుప్రియా దూబే (26), విభూ శర్మ(27) ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకునేందుకు గోవా వచ్చారు. గోవాలోని పాలోలెం బీచ్‌లో జలకాలాడుతూ ప్రమాదవశాత్తూ సముద్రంలో మునిగి మరణించారు. పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో వారిద్దరి మృతదేహాలను కొంకణ్ సోషల్ హెల్త్ సెంటరుకు తరలించి పోస్టు మార్టం చేయించారు. సుప్రియా బెంగళూరులో ఉద్యోగం చేస్తుండగా, ఆమె భర్త విభూ ఢిల్లీలో ఉండేవారు. దంపతులిద్దరూ గత కొన్ని రోజులుగా గోవాలో పర్యటిస్తున్నారని, వీరి మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని గోవా పోలీసులు చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)