రాజ్యసభ మార్చి 13కి వాయిదా !

Telugu Lo Computer
0


రాజ్యసభ తొలి విడుత బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఛైర్మన్ జగ్దీప్ ధన్కర్  సభను మార్చి 13వ తేదీకి వాయిదా వేశారు. ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్షాలు అదానీ ఇష్యూపై చర్చకు పట్టుబట్టాయి. అంశంపై జేపీసీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాయి. విపక్ష సభ్యులు వెల్లోకి వచ్చి నిరనసకు దిగడంతో సభా కార్యక్రమాలకు పలుమార్లు అంతరాయం ఏర్పడింది. ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతుండగా అధికార పక్ష ఎంపీలు సైతం మోడీ.. మోడీ.. అంటూ నినాదాలు చేయడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఛైర్మన్ ఇరుపక్షాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో తీవ్ర అసహనానికి గురైన జగ్దీప్ ధన్కర్ సభను మార్చి 13కు వాయిదా వేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)