పశ్చిమ బెంగాల్ గవర్నర్ కు భద్రత పెంపు

Telugu Lo Computer
0


పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ ఆనంద బోస్‌కు భద్రత పెంచారు. ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆనంద బోస్‌పై దాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘావర్గాల సమాచారంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో సీఆర్‌పీఎఫ్‌ బలగాలు ఆయనకు భద్రత కల్పించనున్నారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన ఆనంద బోస్‌ గతేడాది నవంబర్‌ 23 బెంగాల్‌ కొత్త గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. అంతకు మందు ఆయన వెస్ట్‌ బెంగాల్‌ ఎన్నికల అనంతరం జరిగిన హింసపై నియమించిన విచారణ కమిటీలో సభ్యుడిగా పనిచేశారు. అయితే ఆయనపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఐబీ వర్గాలు నివేదిక ఇవ్వడంతో... కేంద్ర హోం శాఖ భద్రతను కట్టుదిట్టం చేసింది. సీవీ ఆనంద బోస్ కేంద్రంలో కూడా పనిచేశారు. ఆయన కేరళలోని క్విలాన్ (ప్రస్తుతం కొల్లం) జిల్లా కలెక్టర్‭గా పనిచేశారు. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రికి కార్యదర్శిగా.. వ్యవసాయ శాఖలో అదనపు కార్యదర్శిగా కూడా విధులు నిర్వహించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)