అనంత్ అంబానీ - రాధికమర్చంట్ నిశ్చితార్థం ఇటీవల అంగరంగ వైభవంగా జరిగింది. ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరలయ్యాయి. కాగా ఈ ఫొటోల్లో అనంత్ అంబానీ భారీ కాయంతో కనిపించారు. గతంలో భారీగా బరువు తగ్గి నాజుగ్గా మారిన అనంత్ మళ్లీ బరువు పెరగడం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వచ్చాయి. .ఎంత డబ్బున్నా ఆరోగ్యాన్ని కొనలేమంటూ కొందరు నెటిజన్లు అనంత్ అంబానీ ఫొటోలపై కామెంట్లు పెడుతున్నారు. అయితే 2016లో 200 కిలోల నుంచి 100 కిలోల వరకు తగ్గిన అనంత్ అంబానీ మళ్లీ ఎందుకు బరువు పెరిగారన్న విషయంపై తల్లి నీతా అంబానీ స్పందించారు. గతంలో 100 కిలోల వరకు బరువు తగ్గి చాలా మందికి రోల్ మోడల్ గా నిలిచాడు. అయితే నా కుమారుడు కొన్ని తీవ్రమైన ఆస్తమాతో బాధపడ్డాడు. దీనికి చికిత్సలో భాగంగా కొన్ని స్టెరాయిడ్లు తీసుకున్నాడు. వీటి దుష్ప్రభావాల కారణంగానే అనంత్ మళ్లీ బరువు పెరిగాడు' 'అనంత్ ప్రతి రోజూ 5-6 గంటల పాటు వ్యాయామం చేస్తాడు. యోగాతో పాటు కార్డియో వ్యాయామాలు ఆచరిస్తాడు. నా కుమారుడిలాగా ఊబకాయంతో పోరాడుతున్న వారు మన చుట్టూ చాలామందే ఉంటారు. దయచేసి అలాంటివారిని చిన్నచూపు చూడకండి. వారు మరింత మానసికంగా కుంగిపోయే ప్రమాదం ఉంది. వీటికి బదులు బరువు తగ్గేందుకు మంచి సలహాలు, సూచనలు అందించండి' అని నీతా అంబానీ స్ఫూర్తి నింపారు. కాగా ఆస్తమా వంటి తీవ్రమైన వ్యాధులకు వైద్యులు స్టెరాయిడ్స్ ను సూచిస్తారు. దీనివల్ల ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి రాకుండా, శ్వాసకోశాల్లో వాపు తగ్గిపోయి ఉపశమనం లభిస్తుంది. అయితే స్టెరాయిడ్స్ కారణంగా విపరీతమైన ఆకలి కలుగుతుంది. దీనికి ఆస్థమా సమస్య ఉన్న వారు శారీరక వ్యాయామాలు చేయడం కష్టంగా ఉంటుంది. క్రమంగా ఇది బరువు పెరిగేందుకు దారితీస్తుంది.
అనంత్ అంబానీ మళ్లీ బరువు పెరగడానికి కారణం ?
January 27, 2023
0
Tags