ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతున్నది. అక్కడ పగటి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఈ క్రమంలో నూతన సంవత్సరం మొదటి రోజే రాజస్థాన్‌లోని ఏకైక హిల్ స్టేషన్ అయిన మౌంట్ అబూలో పగటి ఉష్ణోగ్రతలు జీరో డిగ్రీల కంటే దిగువకు పడిపోయాయి. కొత్త సంవత్సరం సందర్భంగా స్నో ఫాల్‌ను ఎంజాయ్ చేయడానికి పర్యాటకులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అయితే కొత్త సంవత్సరం తొలి రోజే ఉష్ణోగ్రతలు జీరో డిగ్రీలకు పడిపోవడంతో వారంతా చలికి గజగజ వణికిపోతున్నారు. వెచ్చదనం కోసం నిండా బ్లాంకెట్‌లు కొప్పుకుని హోటల్ గదులకే పరిమితమయ్యారు. చలి ఎంత వణికించినా మౌంట్ అబూలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని పర్యాటకులు చెబుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున చలి విపరీతంగా ఉన్నప్పటికీ సూర్యోదయం తర్వాత వెచ్చదనం పెరిగిందని, ఇప్పుడు చాలా హాయిగా ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మౌంట్ అబూలో జీరో డిగ్రీల కంటే దిగువకు పగటి ఉష్ణోగ్రతలు
January 01, 2023
0
Tags