ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాలలో పద్మావతి నగర్‌లోని ఓ రెస్టారెంట్ ఐదు పైసలకే బిర్యానీ ఆఫర్ తెచ్చింది. పాతకాలం నాటి ఒక పైసా, ఐదు పైసల నాణెం ఇస్తే బిర్యాని ఫ్రీ అని యాజమాన్యం ప్రకటించింది. దీంతో వందలాది మంది తరలివచ్చారు.. యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో క్యూకట్టారు. అది కాస్తా తోపులాటకు దారితీసింది. ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో, రెస్టారెంట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆఫర్ పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని యువకులు చించివేశారు. ఉద్రిక్త పరిస్థితి ఏర్పడడంతో గుంపులను చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జ్ చేశారు. చివరకు రెస్టారెంట్ ను పోలీసులు మూయించారు. రెస్టారెంట్ పై కేసులు పెడతామని డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు.
నంద్యాలలో 5 పైసలకే బిర్యానీ !
January 01, 2023
0
Tags